తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Corona Cases in India: భారత్​లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 227 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

Corona Cases in India
కరోనా కేసులు

By

Published : Dec 25, 2022, 10:32 AM IST

Corona Cases in India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 227 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,46,77,106
  • మరణాలు: 5,30,693
  • యాక్టివ్ కేసులు: 3,424
  • రికవరీలు: 4,41,42,989

Vaccination In India: దేశంలో శనివారం 1,11,304 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,20,05,16,249కు చేరింది. ఒక్కరోజే 1,29,159 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 3,87,162 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 783 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 661,440,225కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,685,239 మంది మరణించారు. మరో 254,789 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 634,024,994కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 1,77,622 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 339 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియా 66,049 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 70 మంది మృతి చెందారు.
  • ఫ్రాన్స్​లో 40,744 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • అమెరికాలో 7,832 వెలుగుచూడగా.. 20 మంది మృతిచెందారు.

ABOUT THE AUTHOR

...view details