తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంతర్జాతీయ కాల్స్​ను లోకల్ కాల్స్​గా మార్చి.. రూ.లక్షల్లో సంపాదన.. ముఠా అరెస్ట్​! - కర్ణాటక టెలిఫోన్ ఎక్స్ఛేంజీ స్కామ్

international calls into local calls: అంతర్జాతీయ కాల్స్​ను లోకల్ కాల్స్​గా మార్చి రూ.లక్షలు సంపాదిస్తున్న ముఠాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి అనేక సిమ్ కార్డులు, ల్యాప్​టాప్​లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం టెలిఫోన్ లైన్​నే అక్రమంగా నిర్మించారని పోలీసులు చెప్పారు.

converting-international-calls-into-local-calls
converting-international-calls-into-local-calls

By

Published : Jun 2, 2022, 11:28 AM IST

Fraud Telephone exchange Bengaluru: చట్టవిరుద్ధంగా టెలిఫోన్ ఎక్స్ఛేంజీలు ఏర్పాటు చేసి భారత టెలికమ్యూనికేషన్స్ శాఖను మోసం చేసిన నిందితులను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రవిచంద్ర, సుబేర్, మను, ఇస్మాయిల్ అబ్దుల్లా, సాహిర్, జోహార్ షరీఫ్​గా గుర్తించారు. ఏడు ల్యాప్​టాప్​లు, 204 సిమ్​కార్డులు, 14 సిమ్ బాక్సులు, ఇంటర్నెట్ వైఫై రూటర్లు, 9 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిపారు. కేరళకు చెందిన వీరంతా అంతర్జాతీయ కాల్స్​ను స్థానిక కాల్స్​గా మార్చుతూ డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఐకాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో నిందితులు ఈ తతంగం నడిపిస్తున్నట్లు గుర్తించారు.

నిందితులు

పోలీసుల కథనం ప్రకారం..
నిందితులు కర్ణాటకలోని మహదేవపుర్​కు చెందిన ఓ వ్యక్తిని సంప్రదించి ఎయిర్​టెల్ ట్రంక్ కాల్ డివైజ్​ను సంపాదించారు. ఇలాంటి పరికరాలను కాల్​సెంటర్లకు ఇస్తుంటారు. ఐకాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరు మీద కంపెనీ రికార్డులను ఏర్పాటు చేశారు. అనంతరం, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా చేసే వాయిస్(వీఓఐపీ) కాల్స్​ను జీఎస్ఎం కాల్స్​గా మార్చడం ప్రారంభించారు. సిమ్​బాక్స్ అనే పరికరాల సాయంతో అంతర్జాతీయ కాల్స్​ను స్థానిక కాల్స్​గా మార్చారు. సిమ్​బాక్స్ పరికరాల ద్వారా ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, బంగాల్ వంటి పలు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ సిమ్​లను సంపాదించారు. ఇదంతా నిర్వహించేందుకు చిక్కసంద్ర మెయిన్ రోడ్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. మొత్తం టెలిఫోన్ లైన్​నే అక్రమంగా నిర్మించారని నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.

ఎంత సంపాదించారంటే..
అంతర్జాతీయ కాల్ చేయాలంటే నిమిషానికి రూ.10 ఖర్చవుతుంది. అదే వీరి అక్రమ పద్ధతుల్లో అయితే రూ.1తో పని పూర్తవుతుంది. ఈ చట్టవిరుద్ధమైన పనితో నిందితులు నెలకు రూ.17లక్షలు సంపాదించారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వానికి ఇంతకన్నా పది రెట్లు ఎక్కువ నష్టం జరిగినట్లే. అంతర్జాతీయ కాల్స్ ద్వారా నిందితులు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. దుబాయిలో ఉండే పుత్తూరు వాసి గతంలో ఈ విషయంపై కేసు నమోదు చేసినట్లు గుర్తించారు.

ప్రక్రియ ఎలా?
fraud telephone calls scam:డార్క్ వెబ్ ద్వారా కాల్స్ వెళ్తాయి. కాల్ చేసిన వ్యక్తి ఫోన్​ నెంబర్ ఇతరులకు తెలియదు. కాల్ స్వీకరించిన వ్యక్తికి వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చినట్లు కనిపిస్తుంది. అందువల్ల కేసు పెట్టినా దీనిపై పోలీసులకు ఎలాంటి సమాచారం లభించేది కాదు. ఇలా సాంకేతికతను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details