ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీతో జరగనున్న జమ్ముకశ్మీర్‌లోని వివిధ పార్టీల సమావేశానికి కాంగ్రెస్ కూడా హాజరుకానుంది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం తెలిపింది. జమ్ముకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని గతంలో చేసిన తీర్మానానికి తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.