అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తోంది కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్. 'ప్రజా ఎన్నికల ప్రణాళిక' పేరిట మేనిఫెస్టోను విడుదల చేసింది.
ఈ మేరకు తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్, ఎంపీ బెన్నీ బెహానన్ ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని విడుదల చేశారు. గృహిణులకు నెలకు రెండు వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది యూడిఎఫ్.
తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతినెల 5కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. పేదలు ఇళ్లు కట్టుకునేందుకు.. 5లక్షల రూపాయల ఆర్థిక సాయం సహా శబరిమల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు చెప్పింది. పెద్దసంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండేళ్ల సడలింపులు ఇస్తామని స్పష్టం చేసింది.
140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఎప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి:'మరోసారి అధికారంలోకి వస్తే 40లక్షల ఉద్యోగాలు'