తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Petrol protest: దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ నిరసన - congress protest against fuel prices

పెట్రో ధరల పెరగుదలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలను కాంగ్రెస్​ శుక్రవారం చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. ఇంధన ధరలను తగ్గించి, వాటిని జీఎస్టీ పరిధిలో చేర్చాలని డిమాండ్​ చేశారు.

congres protest over fuel price
కాంగ్రెస్​ నిరసనలు

By

Published : Jun 11, 2021, 12:22 PM IST

పెట్రోల్​ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్​ శుక్రవారం దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. దేశ రాజధాని దిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు పెట్రోల్​ బంకుల వద్ద నిరసన తెలిపారు.

"యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు.. పెట్రోల్​, డీజిల్​పై పన్ను రూ.9.20గా ఉండేది. కానీ ప్రస్తుతం అది రూ.32గా ఉంది. పెట్రోల్​, డీజీల్​పై ఎక్సైజ్​ సుంకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మేం డిమాండ్​ చేస్తున్నాం. ఇంధన ధరలను కూడా జీఎస్​టీ పరిధిలోకి తీసుకురావాలి," అని దిల్లీలో కాంగ్రెస్​ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

దిల్లీలో పెట్రో ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ నిరసన

పంజాబ్​ అమృత్​ సర్​లో కాంగ్రెస్​ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఇంధన ధరలను ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్​ చేశారు.

పంజాబ్​ అమృత్​సర్​లో నిరసనలు
అమృత్​సర్​లో పెట్రోల్​బంకుల వద్ద కాంగ్రెస్​ నిరసన

కర్ణాటక హుబ్లీలోనూ కాంగ్రెస్​ నిరసన కొనసాగింది. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కర్ణాటక హుబ్లీలో కాంగ్రెస్​ నిరసనలు
హుబ్లీలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర శుక్రవారం 29 పైసలు పెరిగి.. రూ.95.91 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్​పై 28 పైసలు పెరిగి రూ.86.81 వద్ద ఉంది.

ఇదీ చూడండి:petrol price:పెట్రోల్ ధరల్లో భారత్​ ర్యాంక్ ఎంతో తెలుసా?

ఇదీ చూడండి:'మోదీ హయాంలో ధరల పెరుగుదలలో వికాసం'

ABOUT THE AUTHOR

...view details