తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​కు భారీ షాక్​- భాజపాలోకి కేంద్ర మాజీ మంత్రి

RPN Singh resigns from the congress
కాంగ్రెస్​కు భారీ షాక్​- భాజపాలోకి కేంద్ర మాజీ మంత్రి

By

Published : Jan 25, 2022, 12:48 PM IST

Updated : Jan 25, 2022, 3:58 PM IST

12:45 January 25

ఎన్నికలకు ముందు కాంగ్రెస్​కు భారీ షాక్​- కేంద్ర మాజీ మంత్రి గుడ్​బై

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్​పీఎన్​ సింగ్​.. కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పి.. భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో... కేంద్ర మంత్రులు, సీనియర్ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు సింగ్.

"ఒకే రాజకీయ పార్టీ(కాంగ్రెస్​)లో నేను 32 ఏళ్లు ఉన్నాను. కానీ.. ఆ పార్టీ ఇంతకుముందులా లేదు. సిద్ధాంతాలు మారిపోయాయి. ఇకపై భారత్​ కోసం ప్రధాని నరేంద్ర మోదీ కలల్ని సాకారం చేసే దిశగా భాజపాలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తా" అని భాజపాలో చేరిన తర్వాత చెప్పారు సింగ్. తన భార్య సోనియా సింగ్​(ఓ జాతీయ ఛానల్​లో ఎడిటర్​) యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలపై ఆయన స్పందించారు. ప్రస్తుతానికి రాజకీయాల్లో తానొక్కడినే ఉన్నానని, పార్టీ అధిష్ఠానం చెప్పినట్లు చేస్తానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ అధినేత్రికి లేఖ

అంతకుముందు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆర్​పీఎన్​ సింగ్ రాజీనామా లేఖను పంపారు. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు సింగ్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఆర్​పీఎన్​ సింగ్​.. ఝార్ఖండ్​లో కాంగ్రెస్​ వ్యవహారాల బాధ్యులుగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో జేఎంఎంతో కలిసి అధికారంలో ఉంది కాంగ్రెస్​.

అదే కారణమా?

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తన సన్నిహితులకు టికెట్​ నిరాకరించడమే.. సింగ్​ పార్టీని వీడేందుకు కారణమని సమాచారం.

సింగ్​.. యూపీ కుషీనగర్​ నుంచి గతంలో ఎంపీగా సేవలందించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.

మరో ఎంపీ కూడా..

కాంగ్రెస్​ పార్టీకి మరో ఎంపీ గుడ్​బై చెప్పారు. కార్యకర్తలను విస్మరించారని ఆరోపిస్తూ.. మాజీ ఎంపీ ఆనంద్​ ప్రకాశ్​ గౌతమ్​ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడికి పంపించారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్​ జరగనుంది.

మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

గౌతమ్​.. రెండు సార్లు రాజ్యసభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

ధైర్యం లేకనే...

సీనియర్ నేతలు పార్టీ వీడడంపై కాంగ్రెస్​ స్పందించింది. "కాంగ్రెస్​ చేస్తున్న పోరాటాన్ని కొనసాగించాలంటే ధైర్యం అవసరం. పిరికివాళ్లు ఈ యుద్ధం చేయలేరని ప్రియాంక గాంధీ చెప్పారు." అని అన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 25, 2022, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details