రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ ఈనెల 15న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రతిపక్ష నేత ఎంపికకు సిద్ధమైంది కాంగ్రెస్. తమ పార్టీ తరఫున సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించింది. తమ ప్రతిపాదనను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు సమర్పించింది.
ఆజాద్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ముందుగా పలువురు సీనియర్ నేతల పేర్లను పరిశీలించింది. ఆ జాబితాలో మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్, చిదంబరం, కపిల్ సిబల్ వంటి నేతలు ఉన్నారు. అన్ని విధాలుగా ఆలోచించి.. చివరకు మల్లికార్జున్ ఖర్గే పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.