ఉత్త్రర్ ప్రదేశ్ హత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలు చంద్రముఖి దేవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎన్సీడబ్ల్యూ సభ్యులతో కలిసి ఘటన జరిగిన బదాయూ జిల్లాలోని గ్రామానికి వెళ్లిన చంద్రముఖి.. "ఆరోజు ఆమె బయటకు వెళ్లకపోయినా.. లేదా చిన్న పిల్లాడిని తోడు తీసుకు వెళ్లినా ఈ ఘటన జరిగి ఉండేది కాదు. కానీ, ఇది ముందే ప్రణాళిక ప్రకారం జరిగిన సంఘటన. ఆమెను ఫోన్ ద్వారా పిలిచారు. తర్వాత ఆమె బయటకు వెళ్లింది" అని అన్నారు.
"నేరం జరిగినందుకు బాధితురాలిని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిందిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల తర్వాత మహిళలకు రక్షణ ఉంటుందని మీరు అనుకుంటున్నారా?"
--ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.