ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనతో(Lakhimpur Kheri incident ) చెలరేగిన అల్లర్లను మరింత పెంచాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది కాంగ్రెస్. ఈ విషాద ఘటనను గాంధీ కుటుంబం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఒక అవకాశంగా ఉపయోగించుకుంటోందని, సొంత పార్టీ నేతలే వారి తీరుపై ప్రశ్నిస్తున్నారని పేర్కొంది. లఖింపూర్ ఘటనను(lakhimpur kheri news) సూచిస్తూ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ(Rahul Gandhi news) తీవ్ర విమర్శలు చేసిన క్రమంలో ఎదురుదాడికి దిగారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర(BJP spokesperson Sambit Patra). బాధ్యతారాహిత్యం అనేది రాహుల్‌కు రెండో పేరుగా అభివర్ణించారు.
" హింసకు దారితీసేలా.. ప్రతి విషయంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. శాంతి కోసమే విపక్ష నేతలను లఖింపుర్ ఖేరికి(lakhimpur kheri news) ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాజపా ప్రభుత్వం అనుమతించటం లేదు. "
- సంబిత్ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి.