తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేంద్రం అసమర్థతే మహమ్మారి వ్యాప్తికి కారణం' - కాంగ్రెస్​ పార్టీ ట్వీట్లు కేంద్రం

కేంద్రం అసమర్థతే కరోనా రెండో దశ వ్యాప్తికి కారణమని కాంగ్రెస్​ ఆరోపించింది. ప్రధాని ఓ పిరికివాడిలా ప్రవర్తించారని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

congress on incompetence, congress tweet on centre
'రెండో దశ వ్యాప్తికి మీరే కారణం'

By

Published : Jun 12, 2021, 8:01 PM IST

దేశంలో కరోనా రెండో దశ విజృంభణకు కేంద్రం అసమర్థతే కారణమని కాంగ్రెస్​ ఆరోపించింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన సమయంలో ప్రభుత్వం.. ప్రధాని ప్రతిష్ఠను కాపాడుకునే ప్రయత్నం చేశారని పేర్కొంది. ఈ వైఖరి కారణంగా ఎందరో సోదర, సోదరీమణులను కోల్పోయామని ట్విట్టర్​ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.

కాంగ్రెస్​ నేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ట్వీట్టర్​ వేదికగా.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రధాని ఓ పిరికివాడిలా ప్రవర్తించారని ప్రియాంక దుయ్యబట్టారు.

"పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నా ప్రధాని ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆయన ఓ పిరికివాడిలా ప్రవర్తించారు. మన దేశాన్ని దీనిస్థితికి చేర్చారు."

-ప్రియాంక వాద్రా, కాంగ్రెస్​ నేత

'మహమ్మారి, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగంపై చర్యలు చేపట్టకుండా ఎవరు మౌనం వహిస్తున్నారో ప్రజలకు తెలుసు' అని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి :మోదీకి అధిర్​ రంజన్​ చౌదరి లేఖ!

ABOUT THE AUTHOR

...view details