తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బుల్లెట్'​ విడిభాగాలతో 'ఈ-బైక్'- తొమ్మిదో తరగతి విద్యార్థి ఘనత - ఎన్​ఫీల్డ్ విడిభాగాలతో ఈ-బైక్

ఈ-బైక్​ తయారు చేయడం అంత సులువైన పనికాదు. కానీ, 9వ తరగతి విద్యార్థి అది తయారు చేశాడంటే నమ్మగలమా? అదీ.. పాడైపోయిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ విడి భాగాలతో చేశాడంటే అస్సలు నమ్మశక్యంగా అనిపించదు. ఈ-బైక్​ తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన బాలుడి కథ మీకోసం..

E bike
ఈ-బైక్

By

Published : Sep 18, 2021, 2:30 PM IST

Updated : Sep 18, 2021, 4:32 PM IST

తొమ్మిదో తరగతి బాలుడు చేసిన ఈ-బైక్

చిన్న వయసులోనే ఈ-సైకిల్ తయారు​ చేయాలని కలలు కన్నాడు. అయితే ఈ-సైకిల్​ చేసినప్పటికీ.. దాని స్పీడ్​ను అదుపు చేయడంలో విఫలయ్యాడు. ఫలితంగా ఓ కారును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లి.. 'ఈ-బైక్​' తయారు చేయడంలో సఫలమయ్యాడు దిల్లీకి చెందిన 9వ తరగతి విద్యార్థి రాజన్. పాడైపోయిన రాయల్​ ఎన్​ ఫీల్డ్​ మోటార్​ సైకిల్​ విడిభాగాలను పోగు చేసి ఈ-బైక్​ను​ తయారు చేయడం గమనార్హం. చిట్టి చేతులతోనే అద్భుతాన్ని చేసి చూపించాడు రాజన్​.

సుభాష్​ నగర్​లోని సర్వోదయ బాల్ విద్యాలయలో చదువుతున్న రాజన్​.. మూడు రోజుల్లోనే ఈ-బైక్​ తయారు చేసి అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టేశాడు. మూడు నెలల పాటు పాడైపోయిన ఎన్​ఫీల్డ్ భాగాలను సేకరించి.. అతి తక్కువ వ్యయంతో ఈ-బైక్​ను తయారు చేయగలిగాడు.

బాలుడు చేసిన ఈ-బైక్

"బైక్​ తయారీకి సంబంధించిన వస్తువులను సేకరించడానికి మూడు నెలలు పట్టింది. తర్వాత మూడు రోజుల్లో ఈ బైక్ తయారు చేశా. లాక్​డౌన్​ మొదలయ్యాక స్కూల్​ ఉండేది కాదు. ఆ సమయంలో నేను బైక్​ షాపులో సమయం గడిపేవాడిని. మా ఇంటి సమీపంలో ఓ మోటార్ రిపేర్​ షాపు ఉంది. ఆ షాపు యజమానిని.. ఆర్​పీఎమ్ స్పీడ్​ వంటి విషయాలు అడిగి తెలుసుకున్నాను. బైక్​ మోటార్​కు ఎంత ఆర్​పీఎమ్​ స్పీడ్​ అవసరమో అంచనా వేశాను. తర్వాత నాన్నకు మోటార్​ కొనమని చెప్పాను."

--రాజన్, విద్యార్థి.

ఈ ఈ-బైక్​ తయారు చేయడానికి రూ. 45 వేలు ఖర్చు చేసినట్లు రాజన్ తెలిపాడు. తొలుత.. ఈ-బైక్ తయారు చేయగలననే విశ్వాసం తన తండ్రికి ఉండేది కాదని రాజన్​ పేర్కొన్నాడు. కానీ, రాజన్​ తల్లి మాత్రం అతనిపై పూర్తి నమ్మకం ఉంచేదని అన్నాడు.

రాజన్

"చిన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్​ వస్తువులతో ఆడుకోవడం అంటే రాజన్​కు చాలా ఇష్టం. టీవీ మొదలైన వస్తువులను తెరిచి చూస్తుంటాడు. అందులో ఏముంది, ఎలా ఉంటుంది అని తెలుసుకునేవాడు. ఇది ఓ హాబీలా మార్చుకున్నాడు. అనంతరం ఈ-బైక్​ చేయడం నేను వద్దన్నాను. కానీ, వాళ్ల స్కూల్​లో ప్రాజెక్ట్​ వర్క్​గా ఇది చేయమన్నారని నాకు అబద్దం చెప్పాడు. నేను రాజన్​కు ఏమీ సహకరించలేదు కానీ.. అతడు ఈ బైక్ చేసి చూపించాడు."

--దశరథ్​ శర్మ, రాజన్ తండ్రి.

రాజన్​ ఈ-బైక్​ చేయడంపై అతనికి చదువు చెప్పిన గురువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమైనా సహకారం అందిస్తే భవిష్యత్తులో అతడు మరింతగా రాణిస్తాడని అంటున్నారు.

ఇదీ చదవండి:

బ్యాగులో రూ.లక్ష నగదు.. ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు?

Last Updated : Sep 18, 2021, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details