కన్నడ పవరస్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం(puneeth rajkumar news) పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఆయన పేరును అవార్డు కోసం కేంద్రానికి సిఫారసు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రికి సూచించారు భాజపా మంత్రులు(karnataka news).
పునీత్(puneeth rajkumar news kannada) సాధించిన విజయాలు, చేసిన సేవలకు ఆయన బతికున్నప్పుడే పద్శశ్రీతో సత్కరించాల్సిందని కన్నడ నటుడు, వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్ అన్నారు. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేరని, మరణానంతరం అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
'ఒక అభిమానిగా ఇతరుల డిమాండ్‌తో నేను ఏకీభవిస్తున్నా. పునీత్ పేరును కేంద్రానికి సిఫారసు చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నా. ఒక నటుడిగా, సమాజ సేవకుడిగా ఆయన ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హులు' అని పాటిల్ పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు వస్తే ఏకగ్రీవంగా ఆమోదిస్తామని స్పష్టం చేశారు.
కర్ణాటక పర్యటక మంత్రి ఆనంద్ సింగ్ కూడా ఇదే డిమాండ్ చేశారు. పునీత్‌కు ఎప్పుడూ సేవ చేయాలనే దృక్పథం ఉండేదని, పల్స్ పోలీయో వంటి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. కన్నడ నటుడు ప్రేమ్ కూడా పునీత్‌కు వీలైనంత త్వరగా పద్మశ్రీ ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ కూడా..
పునీత్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు సిద్ధారామయ్య కూడా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై(karnataka cm news) ఇటీవలే స్పందించారు. ఎప్పుడు, ఏ రంగానికి చెందిన వారి పేర్లను పద్మ అవార్డులకు సిఫారసు చేయాలో నిబంధనలు ఉన్నాయన్నారు. ఒక విధంగా పునీత్ రాజ్‌కుమార్ పేరు ఏకగ్రీవంగా సిఫారసు అవుతుందని, ప్రభుత్వం అన్ని విషయాలు పరిగణించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కర్ణాటక ప్రజలు, ప్రభుత్వానికి పునీత్ రాజ్‌కుమార్ పట్ల ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు.
భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మశ్రీ ఒకటి. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. వివిధ రంగాల్లో పౌరులు చేసిన విశేష సేవలకు గానూ ఈ పురస్కారంతో గౌరవిస్తుంది.
పునీత్ రాజ్‌కుమార్.. కన్నడ దిగ్గజ నటుడు రాజ్‌కుమార్ కుమారుడు. ఐదుగురు సంతానంలో ఆయనే చిన్నవాడు. అక్టోబర్ 29న వ్యాయామం చేస్తూ గుండెపోటు రాగా ఆస్పత్రిలో చేరిన పునీత్.. ఆరోజే మరణించారు(puneeth rajkumar news). 6 నెలల వయసులోనే వెండితెర తెరంగ్రేట్రం చేసిన ఆయన.. 2002లో అప్పు సినిమా ద్వారా హీరోగా పరిచమయ్యారు. పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించి కన్నడ పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గొప్ప దాతృత్వం చాటుకున్నారు.
ఇదీ చదవండి:'ఆర్యన్ కిడ్నాప్‌కు వాంఖడే స్కెచ్- షారుక్‌కు బెదిరింపులు!'