ఐస్‌క్రీమ్ బాల్ పేలి ఓ 12 ఏళ్ల బాలుడు గాయపడిన ఘటన కేరళలోని కన్నుర్ జిల్లాలో చోటుచేసుకుంది. పేలుడు పదార్థాలు ఉన్న ఆ ఐస్‌క్రీమ్ బాల్‌తో బాలుడు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో చుట్టుపక్కల వారు ఎవరూ గాయపడలేదని తెలిపారు. గాయపడిన బాలుడు నారివయల్కు చెందిన శ్రీవర్ధన్గా అధికారులు గుర్తించారు.
బంతి అనుకుని..
క్రికెట్ ఆడుతుండగా ఆ బంతి సమీపాన పడిందని.. అక్కడే ఈ ఐస్‌క్రీమ్ బాల్స్ బాలుడికి దొరికాయని పోలీసులు వెల్లడించారు. బంతి అనుకుని దీనిని విసరగానే పేలుడు సంభవించిందని తెలిపారు. ఘటనాస్థలంలో ఇటువంటి మరో రెండిటిని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పేర్కొన్న పోలీసులు.. ఆ ఐస్‌క్రీమ్ బంతుల్లోని పదార్థాల వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఈ ఏడాది కన్నూర్ జిల్లాలో ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి. మే నెలలో కూడా ఇటువంటి పేలుడే సంభవించింది. ఆ ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.
ఇదీ చూడండి :స్కూల్ బస్సు మిస్ అయిందని.. విద్యార్థి ఆత్మహత్య!