తెలంగాణ

telangana

కశ్మీర్​లో ఎన్నికలు జరిగినా ఆ అధికారాలు కేంద్రానివే!

By

Published : Jun 25, 2021, 1:49 PM IST

జమ్ముకశ్మీర్​లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎన్నికలు నిర్వహించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? అధికరణ 370 రద్దుకు మునుపటి పరిస్థితులు వస్తాయా అంటే స్పష్టత లేదు. అధికారాలు, శాంతి భద్రతలు కేంద్రం పరిధిలోనే ఉండే అవకాశాలున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Centre to govern JK law & order
'కశ్మీర్​ పాలన' కేంద్రం చేతుల్లోనే

జమ్ముకశ్మీర్​ అంశంపై అక్కడి పార్టీల ప్రతినిధులతో దాదాపు 3 గంటలకుపైగా సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్​), ఆపై ఎన్నికలు తదితర విషయాల గురించి కీలకంగా చర్చించారు. డీలిమిటేషన్​ ప్రక్రియ పూర్తయితే.. సత్వరమే ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందన్నారు మోదీ.

మరి.. పోలింగ్​ తర్వాత కశ్మీర్​లో పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మిగతా కేంద్ర పాలిత ప్రాంతాల్లా కాకుండా.. జమ్ముకశ్మీర్​లో శాంతి భద్రతలు, అధికారాలు కేంద్రం పరిధిలోనే ఉండనున్నట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. చాలా విషయాల్లో దేశ రాజధాని హోదాకు సమానంగా కేంద్రం, రాష్ట్రం అధికారాలను పంచుకోనున్నట్లు చెబుతున్నారు. అంటే.. అధికరణ 370 రద్దు చేసిన 2019 ఆగస్టు 5కు మునుపటి పరిస్థితులు ఉండే అవకాశాలే లేవంటున్నారు.

జోక్యానికి వీల్లేదు..

జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ శాసన కార్యనిర్వాహక అధికారాలు మిగతా రాష్ట్రాల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లా కాకుండా కేంద్రం చేతుల్లోనే ఉండనున్నాయి. శాంతి భద్రతలు, పోలీసు విభాగంలో.. రాష్ట్ర అసెంబ్లీ జోక్యం చేసుకొనే వీల్లేదు. దీనిని దిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.

మిగతా రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అక్కడి ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటాయి. కానీ కశ్మీర్​లో మాత్రం అలా కుదదు.

అధికరణ-370 రద్దు చేసి, కశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత 2019 ఆగస్టు 9న కేంద్రం చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. జమ్ముకశ్మీర్​ పునర్వవస్థీకరణ చట్టంలోనూ దీనిని పొందుపరిచింది.

ఎన్నికలు ఎప్పుడు?

ప్రధాని నివాసంలో గురువారం జరిగిన సమావేశంలో.. కేంద్రం జమ్ముకశ్మీర్​ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే కాలపట్టికను కూడా ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని ప్రకారం.. వచ్చే ఏడాది ప్రారంభంలోనే పోలింగ్​ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఎన్నికల తేదీలపై తుది నిర్ణయాధికారం మాత్రం ఎన్నికల సంఘానిదే.

2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్​కు స్వయంప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో జమ్ముకశ్మీర్​లో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. ఆర్టికల్​ 370(Article 370) రద్దు తర్వాత అక్కడి నేతలతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి.

(రచయిత- సంజీవ్​ కుమార్ బారువా)

ఇవీ చదవండి: కశ్మీర్​-దిల్లీ దూరానికి ముగింపు పలకాలి: మోదీ

'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'

ABOUT THE AUTHOR

...view details