తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. DA 4% పెంపు - 7th pay commission latest news

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను నాలుగు శాతం మేర పెంచుతూ మోదీ సర్కార్​ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ మొత్తం 38 శాతానికి చేరనుంది. ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.

Central Government DA Hike News
Central Government DA Hike News

By

Published : Sep 28, 2022, 2:55 PM IST

Central Government DA Hike News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం- డీఏను నాలుగు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో డీఏ పెంపునకు ఆమోదం లభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ మొత్తం 38 శాతానికి చేరనుంది. ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.

ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం మేర మోదీ ప్రభుత్వం డీఏ పెంచింది. దీంతో మూల వేతనంలో డీఏ 34 శాతానికి చేరింది. తాజా పెంపు నిర్ణయంతో అది 38 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేర డీఏ పెంచే అవకాశం ఉంది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details