తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలా చేస్తే ప్రభుత్వ పనితీరుపై ప్రభావం: కేంద్రం - పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులు

కరోనా కారణంగా గతేడాది సివిల్ సర్వీసు పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించడానికి నిరాకరిస్తూ సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. మరోసారి పరీక్ష నిర్వహిస్తే ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడుతుందని తెలిపింది.

center files affidavit on plea by civils aspirants who missed upsc prelims due to covid19
అలా చేస్తే పరీక్షల నిర్వహణపై ప్రభావం: కేంద్రం

By

Published : Jan 25, 2021, 11:56 PM IST

కరోనా కారణంగా గత అక్టోబర్​ 4న నిర్వహించిన యూపీఎస్​సీ సివిల్ సర్వీసు ప్రాథమిక పరీక్షకు గైర్హాజరైన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మరోసారి పరీక్ష నిర్వహించలేమని ధర్మాసనానికి కేంద్రం విన్నవించింది. పిటిషనర్లకు ఉపశమనం కలిగిస్తే భవిష్యత్తులో ఇతర అభ్యర్థులపై పక్షపాతం చూపించినట్టవుతుందని పేర్కొంది. కొంతమంది అభ్యర్థులకు అదనపు ప్రయత్నం, సడలింపునివ్వడం వంటి చర్యలు ఇతర ఆశావాహుల అవకాశాలను దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

ప్రభుత్వ పనితీరు ప్రభావితం: కేంద్రం

ప్రజా పరీక్షల విభాగ పనితీరును ఈ చర్య తీవ్ర ప్రభావితం చేస్తుందని అందువల్ల ప్రస్తుత పిటిషనర్లకు అవకాశం కల్పించడం కుదరదని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం కార్యదర్శి సుప్రీంకోర్టులో అఫిడవిట్​ సమర్పించారు. కాగా, ఈ అంశంపై విచారణకు జనవరి 28కి వాయిదా వేసింది సుప్రీం.

ఇదీ చదవండి:సివిల్స్ అభ్యర్థులకు మరో ఛాన్స్​పై సుప్రీం విచారణ

ABOUT THE AUTHOR

...view details