Census 2021: కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడిన జనాభా లెక్కలు.. ఈ ఏడాదిలో జరుగుతాయని అంతా భావించారు. అయితే జనగణన ఇప్పట్లో జరిగినట్లు కనిపించడం లేదు. దేశంలో మూడోదశ కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి వాయిదా పడే అవకాశముంది.
Census 2021: దేశంలో జనగణన ఇప్పట్లో లేనట్లే! - దేశంలో జనగణన
Census 2021: భారత్లో జనాభా లెక్కలు ఇప్పట్లో జరగకపోవచ్చు. కొవిడ్ వ్యాప్తి కారణంగా మరోసారి వాయిదా పడే అవకాశముంది. జనగణనకు సంబంధించి ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు.

Census 2021
జనగణన ఎప్పుడు నిర్వహించాలి? జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) వివరాలు పొందుపరడం వంటి విషయాలపై కేంద్ర హోం శాఖ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. అంతే కాకుండా జిల్లాలు, సబ్డివిజన్లు, తాలుకాలు, పోలీసు స్టేషన్ల పరిధి, సరిహద్దులను జూన్ 2022 వరకు మార్పులు చేయకూడదని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జనగణన వాయిదా తద్యమనిపిస్తోంది. అక్టోబరు వరకు జనాభా లెక్కలు జరగకపోవచ్చని సమాచారం.
ఇదీ చూడండి:సీఎం ఎదుటే వాగ్వాదానికి దిగిన మంత్రి, ఎంపీ