కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేపట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరని ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను విపక్షాలు స్వాగతిస్తున్నాయి. అయితే ఈ అంశంపై మహారాష్ట్రకు చెందిన మంత్రి అస్లాం షేక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
"భాజపా పాలనలో సీబీఐ ఓ పాన్ షాప్లా తయారైంది. ఎక్కడికైనా వెళ్లి, ఎవరి మీద పడితే వారి మీద కేసులు పెడుతుంది. ముఖ్యంగా భాజపా పాలనలో లేని రాష్ట్రాల్లోనే సీబీఐ ఇలా వ్యవహరిస్తోంది. మంత్రులు, ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకుంటుంది. అందుకే మేం సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం."