Powergrid Tata Projects: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీఎస్ ఝాపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొరడా ఝుళిపించింది. లంచం తీసుకొని.. ప్రైవేట్ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను గురువారం అరెస్టు చేసింది. ఇదే కేసులో టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దేశ్రాజ్ పాఠక్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎన్ సింగ్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది సీబీఐ.
గాజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, దిల్లీ సహా మరికొన్ని ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది సీబీఐ. గురుగ్రామ్‌లోని ఝాకు చెందిన కార్యాలయాల్లో రూ.93 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఝా ప్రస్తుతం ఈటా నగర్లో విధులు నిర్వర్తిస్తున్నారు.