కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆర్ రోషన్ బేగ్‌ను కేంద్ర దర్యాప్తు బృందం(సీబీఐ) అరెస్టు చేసింది. ఐ-మానెటరీ అడ్వైజరీ(ఐఎంఏ) పోంజీ కుంభకోణం కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పోంజీ స్కామ్‌లో కర్ణాటక మాజీ మంత్రి అరెస్టు
పోంజీ కుంభకోణం కేసులో కర్ణాటక మాజీ మంత్రి ఆర్ రోషన్‌ను సీబీఐ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సరైన ఆధారాలు ఉన్నందున ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించిందని వెల్లడించారు
ఆర్ రోషన్
రోషన్‌కు సీబీఐ ఆదివారం ఉదయం సమన్లు జారీ చేసింది. సరైన ఆధారాల కారణంగా ఆయన్ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు వెల్లడించారు.
ఇస్లామిక్ పెట్టుబడుల మార్గాల ద్వారా అధిక రాబడిని ఇప్పిస్తామని హామీ ఇచ్చి కర్ణాటకకు చెందిన ఐఎంఏ సంస్థలు.. లక్షలాది మందిని మోసం చేశాయి. ఈ కుంభకోణం విలువ కోట్లలో ఉందని అధికారులు తెలిపారు.