Cat murder in Pune: నాలుగు నెలల పిల్లిని హతమార్చిన ఓ మహిళపై జంతు హింస చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. ప్రశాంత్ దత్తాత్రేయ అనే వ్యక్తి ఇంట్లో 3-4 నెలల పిల్లి ఉంది. గుడిపడ్వా రోజున అతడి భార్య బయట ముగ్గులు వేస్తున్న సమయంలో పిల్లి పక్కింట్లోకి వెళ్లింది. కాపేటి తర్వాత.. అదురుకుంటూ వచ్చేసిన మార్జాలం.. క్షణాల్లో ప్రాణాలు విడిచింది. అనంతరం పిల్లికి పంచనామా నిర్వహించిన యజమాని.. షాకింగ్ విషయం తెలుసుకున్నారు. దాని తలపై పక్కింటావిడ కర్రతో బలంగా మోదడం వల్లే పిల్లి చనిపోయిందని నిర్ధరణకు వచ్చాడు. దీంతో శిల్పా నిలకంఠ్ అనే నిందితురాలిపై కేసు నమోదైంది.
పండుగ రోజే పిల్లి హత్య.. మహిళపై కేసు నమోదు - cat gets beaten to death
పండుగ రోజే నాలుగు నెలల పిల్లి చనిపోయింది. దానికి పంచనామా నిర్వహించిన యజమాని షాకింగ్ విషయం తెలుసుకున్నారు. దీంతో పక్కింటావిడపై కేసు నమోదైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
pune cat killed