Car Thief Arrested in Delhi: రాయల్ లైఫ్ కోసం అతను దొంగతనాలు ప్రారంభించాడు. పోలీసులకు చిక్కకుండా.. కార్లను కొట్టేయడం మొదలుపెట్టాడు. సీసీటీవీల్లోనూ అతని ఆచూకీ తెలియదు. ఒకటి, రెండు కాదు.. అతను దొంగిలించిన కార్ల సంఖ్య వందల్లో ఉంటుంది. ఒక్క ఏడాదిలో ఏకంగా 100 కార్లను కొట్టేసిన చరిత్ర అతనిది. ఈ కార్ రాజాపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో 'కార్ రాజా' ఆగడాలకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావించిన దిల్లీ పోలీసులు దాదాపు రెండు నెలలు శ్రమించి నిందితుడిని పట్టుకున్నారు.
సీసీటీవీలకు చిక్కడు..
ఈ అంతర్రాష్ట్ర దొంగ.. దిల్లీ ఎన్సీఆర్, యూపీ, కశ్మీర్ పరిధిలో కార్ల చోరీలకు పాల్పడుతుంటాడు. ఆర్డర్ రావడమే ఆలస్యం.. చిన్న కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు ఏదైనా క్షణాల్లో మాయం చేసి నెంబర్ ప్లేట్లు తారుమారు చేసి కస్టమర్లకు అమ్మేస్తుంటాడు. అందుకే ఇతనికి 'కార్ రాజా' అని పేరు వచ్చింది. ఈ కార్ రాజా.. కునాల్ అలియాస్ తనుజ్ అలియాస్ విజయ్‌గా కూడా బ్లాక్ మార్కెట్లో సుపరిచితుడు. కునాల్‌ను సీసీటీవీతో గుర్తించాలని అనుకున్న పోలీసులకు నిరాశే మిగిలింది.
క్రిమినల్ రికార్డ్స్ తిరగేస్తే..