పోలీసులు చేసిన పనికి ఓ కారు ఓనర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. వారిచ్చిన నోటీసు చూసి కంగుతిన్నాడు. కారులో పక్కన కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని.. పోలీసులు విధించిన రూ.500 ఫైన్ నోటీసుతో అవాక్కయ్యాడు. నోటీసును తనిఖీ చేయగా పొరపాటున తనకు జరిమానా విధించారని తెలిసింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
'హెల్మెట్ పెట్టుకోలేదు.. రూ.500 ఫైన్ కట్టు'.. కారు ఓనర్కు పోలీసుల నోటీస్ - Karnataka Traffic Police
హెల్మెట్ పెట్టుకోలేదని కారు ఓనర్కు రూ.500 ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో కారు యజమాని అవాక్కయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అనంతరం పోలీసులను సంప్రదించగా వారు జరిగింది చెప్పారు. చివరకు ఏమైందంటే?
వివరాల్లోకి వెళితే..
మంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఓ కారు ఓనర్కు రూ.500 ఫైన్ విధించారు. డిసెంబర్ 29న ఈ నోటీస్ను జారీ చేశారు పోలీసులు. డిసెంబర్ 22న మంగళాదేవి ప్రాంతంలో.. వెళుతున్న సయమంలో కారు యజమాని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించారని ఈ చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఇదే విషయంపై ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాడు ఆ కారు ఓనర్. వాస్తవాన్ని తెలుసుకున్న పోలీసులు.. నోటీసు పంపడంలో పొరపాటు జరిగిందని సదరు కారు యజమానికి తెలిపారు.
"కారు వెళుతున్న సమయంలో దాని వెనకాలే ఓ బైక్ ఉంది. ఆ బైకర్.. వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరిచంలేదు. పొరపాటున వారికి విధించే ఫైన్.. కారు ఓనర్కు విధించాం. ఆటోమేషన్ విధానంలో పొరపాటు వల్ల ఇలా జరిగింది" అని పోలీసులు తెలిపారు. అనంతరం సమస్యను పరిష్కరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.