తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారును హెలికాప్టర్​గా మార్చిన వ్యక్తి! పెళ్లి ఊరేగింపు కోసం రూ.7.50 లక్షలు ఖర్చు పెట్టి మరీ.. - పెళ్లిళ్ల కోసం హెలికాప్టర్​గా మారిన కారు

పెళ్లి అంటేనే ఎన్నో మరిచిపోలేని మధురానుభూతుల కలయిక. అలాంటి పెళ్లి కోసం ప్రతీఒక్కరూ వారికి ఉన్నంతలో ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. పెళ్లిలో వధూవరులను ఊరేగించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే పెళ్లిలో ప్రత్యేకంగా నిలిచేందుకు ఓ వివాహ నిర్వాహకుడు తన కారును హెలికాప్టర్​గా మార్చారు. ప్రస్తుతం ఆ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ఎక్కడ అంటే?

car-converted-into-helicopter-in-kaimur
కారును హెలికాప్టర్​గా మార్చిన వ్యక్తి!

By

Published : Nov 14, 2022, 10:53 AM IST

Updated : Nov 14, 2022, 12:27 PM IST

రూ. 7.50 లక్షలు పెట్టి కారును హెలికాప్టర్​గా మార్చిన వ్యక్తి!

ఓ వ్యక్తి రూ. 7.50 లక్షలు ఖర్చు చేసి కారును హెలికాప్టర్​గా మార్చారు. అయితే ఇది ఎగరకపోయినా పెళ్లిలో వధూవరుల ఊరేగింపులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తోంది. హెలికాప్టర్​ రూపంలో ఉన్న ఈ కారుకు.. విపరీతమైన డిమాండ్​ ఉంది. బిహార్​ కైమూర్​ జిల్లాలోని మెహనియా ప్రాంతానికి చెందిన.. అమర్​నాథ్​ కుమార్​ గుప్తా అనే వివాహ నిర్వాహకుడు తన కారును హెలికాప్టర్​గా మార్చాడు.

"ఈ హెలికాప్టర్​ కారును ముంబయిలో ప్రత్యేకంగా తయారు చేయించాను. దీనికోసం 8 నెలలు కష్టపడ్డి.. రూ.7.50 లక్షలు ఖర్చు చేశాను. ఈ కారును నవంబర్​ 25 నుంచి వివాహాల కోసం అందుబాటులోకి తీసుకువస్తాను. ఇప్పటికే డిసెంబర్​ 22 వరకు ఈ కారు బుక్​ అయ్యింది. దీనికి ఒక్కసారికి రూ.7,000 అద్దె తీసుకుంటాను. అదనపు ఖర్చులు వాళ్లే భరించాలి. ప్రస్తుతం దీని కోసం పక్క జిల్లాల నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి"

-అమర్​ నాథ్​ కుమార్​ గుప్తా, కారు యజమాని

అమర్​నాథ్.. 8 నెలల పాటు శ్రమించి తన కారును ప్రత్యేకంగా తయారుచేయించారు. పెళ్లిలో వధూవరుల ఊరేగింపు కోసమే దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించానని చెప్పారు. ఈ కారు అచ్చం హెలికాప్టర్​లానే కనిపిస్తుంది కానీ పైకి ఎగరలేదని.. అయినా సరే వివాహాల సీజన్​లో దీనికి అధిక డిమాండ్​ ఉందని కారు యజమాని తెలిపారు. హెలికాప్టర్​లా కనిపించే ఈ కారును 'దుల్హన్ చాలీ ససురల్' గా పిలుస్తున్నారు. అంటే వధువును తన అత్తామామల ఇంటికి తీసుకువచ్చే వాహనం అని అర్ధం.

హెలికాప్టర్​లా కనిపిస్తున్న కారు
హెలికాప్టర్​లా కనిపిస్తున్న కారు
Last Updated : Nov 14, 2022, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details