Bully Bai App Case: బుల్లీబాయ్ యాప్ కేసు విచారణలో భాగంగా మరొకరిని అరెస్ట్ చేశారు ముంబయి సైబర్ సెల్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలు శ్వేతాసింగ్(19)ను ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు మరో నిందితుడు విశాల్ కుమామ్ ఝా(21)ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఐపీసీ ప్రకారం సెక్షన్ 509, 354ఏ కింద వీరిపై కేసు నమోదు చేశారు. శ్వేతను బుధవారం బాంద్రా కోర్టులో హాజరుపరచనున్నారు. వీరిద్దరికీ ఇదివరకే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు. బుల్లీబాయ్ ట్విట్టర్ ఖాతాను, అందులోని సమాచారాన్ని తొలగించాలని ఇప్పటికే పోలీసులు ట్విట్టర్‌కు నోటీసులు పంపారు.
మరోవైపు బుల్లీబాయ్ యాప్ కేసును ఇంటిలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటెజిక్ ఆపరేషన్స్ యూనిట్‌కు(ఐఎఫ్ఎస్ఓ) బదిలీ చేశారు పోలీసులు. ఈ మేరకు ఎంఎల్ఏటీ నుంచి అనుమతి లభించింది. ఈ యాప్‌పై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు కేసును ఐఎఫ్ఎస్ఓకు అప్పచెప్పింది పోలీస్ శాఖ.