తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హెలికాప్టర్​ వల్లే నా గేదె చనిపోయింది'.. పైలట్​పై వృద్ధుడి ఫిర్యాదు - రాజస్థాన్​లో హెలికాప్టర్​ శబ్దంతో గేదె మృతి

హెలికాప్టర్​ శబ్దంతో తన గేదె చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడో వృద్ధుడు. ఈ ఘటన రాజస్థాన్​లోని అల్వార్ జిల్లాలో జరిగింది. ఇంతకీ ఏమైందంటే..

Application Against Helicopter Pilot
Application Against Helicopter Pilot

By

Published : Nov 14, 2022, 9:36 AM IST

Updated : Nov 14, 2022, 11:36 AM IST

రాజస్థాన్​లోని అల్వార్​లో వింత ఘటన జరిగింది. హెలికాప్టర్​ శబ్దం వల్లే తన గేదె చనిపోయిందని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడో వృద్ధుడు. దీనిపై స్పందించిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామన్నారు.

ఇదీ జరిగింది..అల్వార్​ జిల్లా బహ్​రోడ్​ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జీత్​ యాదవ్ వస్తున్నారని కార్యకర్తలు ఆయన్ని స్వాగతించడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే హెలికాప్టర్​ నుంచి తమ ప్రియతమ నాయకుడిపై పూల వర్షం కురిపించాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే ఆదివారం హెలికాప్టర్ నుంచి ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించారు. అయితే ఆ హెలికాప్టర్​ బహ్​రోడ్​ ప్రాంతంలో కొన్నిసార్లు చక్కర్లు కొట్టింది. అనంతరం కోహ్రానా అనే గ్రామం మీదుగా వెళ్లింది. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల పెద్ద శబ్దం వచ్చింది. దాంతో రూ.1.5 లక్షల విలువైన గేదె మృతిచెందిందని ఆ గ్రామానికి చెందిన బల్వీర్ అనే వృద్ధుడు ఆరోపించాడు. అనంతరం హెలికాప్టర్ పైలట్ నిర్వాకంపై ఆగ్రహించిన బల్వీర్​.. అతడిపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చనిపోయిన గేదెను పరీక్ష నిమిత్తం వెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. పరీక్ష నివేదిక అనంతరం.. గేదె ఎలా చనిపోయిందో తెలుస్తుందని.. దాని ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ఫిర్యాదు పత్రం
Last Updated : Nov 14, 2022, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details