BSF Seized Drugs: పంజాబ్‌లోని భారత్- పాకిస్థాన్ సరిహద్దు వద్ద రెండు వేర్వేరు ఘటనల్లో 7.4 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేశారు బీఎస్ఎఫ్ అధికారులు. హెరాయిన్‌తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన స్మగ్లర్లు ఈ మాదకద్రవ్యాలను భారత్‌లోకి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లోని సరిహద్దు వద్ద నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో 6.3 కిలోలు ఉండే ఆరు ప్యాకెట్ల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఓ పిస్టల్, మ్యాగజైన్లు కూడా లభ్యమయ్యాయి.