Bridegroom Expelled From Wedding: వివాహ వేడుక అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిపించాలని అనుకున్నారు ఆ పెళ్లిపెద్దలు. ఇందులో భాగంగా అనుకున్న ముహుర్తానికే వధూవరులకు వివాహం చేయాలని నిశ్చయించారు. కానీ ఇందుకు బరాత్ అడ్డమొచ్చింది. టైం అయిపోతున్నా పట్టించుకోకుండా పెళ్లి కుమారుడు స్టెప్పులేస్తుంటే విసుగొచ్చి అతడ్ని చితకబాదారు వధువు కుటుంబీకులు. అతడ్ని పెళ్లి మండపం నుంచి గెంటేశారు. ఈ ఘటన మహారాష్ట్ర బుల్ధానా జిల్లాలో ఈనెల 22న జరిగింది.
సింద్ఖేద్రాజా తాలుకాకు చెందిన వరుడికి మల్కాపుర్ పంగ్రా ప్రాంతానికి చెందిన వధువుతో పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 22న మధ్యాహ్నం వధువు స్వస్థలంలోనే వివాహాన్ని జరిపించాలని ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. కానీ తీరా పెళ్లి రోజున వరుడు ట్విస్ట్ ఇచ్చాడు. మండపం వద్దకు రావడానికి ఆలస్యం చేశాడు.