తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వంట పాత్రలో మండపానికి వధూవరులు- వరద మధ్యే పెళ్లి - కేరళలో వరద మధ్యే పెళ్లి

కేరళలో జరిగిన ఓ వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు కారణం వధూవరులు పెళ్లి మండపానికి వంట పాత్రల్లో రావడమే. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వివాహ వేదిక నీట మునగ్గా.. పక్కనున్న మరో హాల్​కు చేరుకునేందు వంట పాత్రల్లో వెళ్లారు వధూవరులు.

Bride, groom reach flooded hall in cooking vessel
కళ్యాణ మండపానికి వంట పాత్రల్లో వచ్చిన వధూవరులు

By

Published : Oct 18, 2021, 1:23 PM IST

Updated : Oct 18, 2021, 4:58 PM IST

వంట పాత్రలో మండపానికి వధూవరులు- వరద మధ్యే పెళ్లి

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ గజగజలాడుతోంది. అనేక ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేరువేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అయినా... ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలని సంకల్పించింది ఓ జంట. రోడ్డుపై నడుము లోతు నీరు నిలవగా.. కళ్యాణ మండపానికి వెళ్లేందుకు వంట పాత్రలనే వాహనంగా చేసుకున్నారు వరుడు, వధువు. నీట మునిగిన మండపానికి చేరుకుని పెద్దలు నిశ్చయించిన సమయానికే వివాహం చేసుకొని కొత్త జీవితానికి నాంది పలికారు.

ఆకాశ్​-ఐశ్వర్య.. తలవాడిలోని ఓ గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా గుడి నీట మునిగింది. దీంతో సమీపంలో ఉన్న కళ్యాణ మండపానికి చేరుకోవాలని అనుకున్నారు. దీంతో పెళ్లికి తెచ్చిన అల్యూమినియం వంటపాత్రల్లో కూర్చుని మండపానికి చేరుకున్నారు ఆకాశ్​-ఐశ్వర్య.

"మేము వచ్చి చూసినప్పుడు గుడి దగ్గర నీరు లేదు. దీంతో పెళ్లి అక్కడే చేసుకోవాలి అని అనుకున్నాము. కరోనా కారణంగా ఈ పెళ్లికి మేము చాలా తక్కువ మందిని ఆహ్వానించాం. వర్షం కారణంగా గుడి వద్ద నీరు ఎక్కువగా చేరుకుంది. కానీ సోమవారం చాలా మంచి ముహూర్తం ఉంది. అందుకే ఇదే తేదీకి విహాహం చేసుకోవాలని అనుకున్నాం. పాత్రల్లో పక్కన ఉన్న హాల్​కు వెళ్లి పెళ్లి చేసుకున్నాం."

-ఆకాశ్​, ఐశ్వర్య

ఆకాశ్​, ఐశ్వర్య.. కేరళ చెంగనూర్​లోని ఓ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్నారు.

ఇదీ చూడండి:వరదలతో కేరళ అతలాకుతలం- రెడ్ అలర్ట్ జారీ

Last Updated : Oct 18, 2021, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details