తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్టేజిపైనే వరుడు నిద్ర.. వధువు రియాక్షన్ చూస్తే...

వధువు పక్కనుండగానే వరుడు నిద్రపోతే. తన పెళ్లిలో తానే.. అందరూ చూస్తుండగానే స్టేజిపైనే గుర్రుపెట్టి పడుకుంటే? వినడానికి కాస్త వింతగా ఉంది కదూ? జనసందోహం మధ్యే పెళ్లిమండపంలో నిద్రపోతున్న ఓ వరుడి వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

bride sleep on stage
స్టేజిపైనే నిద్ర

By

Published : Jul 18, 2021, 1:38 PM IST

వివాహ వేడుకల్లో కనిపించే సరదా దృశ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా వధూవరుల మధ్య వచ్చే సన్నివేశాలు చూడముచ్చటగా ఉంటాయి. అయితే.. ఓ వరుడు స్టేజిమీదే గుర్రుపెట్టి నిద్రపోవడమన్నది మాత్రం అరుదు. అలాంటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

పెళ్లికి వచ్చిన అతిథులతో వధువు సరదాగా సంభాషిస్తుండగా.. వరుడు మాత్రం హాయిగా నిద్రపోవడం కనిపించింది. నిరంజన్ మహాపాత్ర అనే యూజర్ తన ఇన్​స్టా ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో.. బాగా చక్కర్లు కొడుతోంది. భార్య భుజంపై చేయి వేసి నిద్రపోతున్న వరుడ్ని లేపి కూర్చోబెట్టేందుకు పక్కనే ఉన్న స్నేహితులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు నవ్వులు పూయిస్తున్నాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మద్యం సేవించడం వల్లే వరుడు నిద్రపోయాడని.. అందుకే సరిగా కూర్చోలేకపోతున్నట్లు కొందరు కామెంట్ చేశారు. శోభనం రాత్రి పడుకునే సమయం ఉండదు గనుక ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్నాడని కొందరు చమత్కరించారు. మరికొందరు దీనిని కావాలనే తీసిన వీడియోగా అభిప్రాయపడ్డారు. "జగ్ జా.. కోయి ఔర్ షాదీ కర్ లే జాయెగా" అంటూ ఇంకొందరు స్పందించారు.

స్టేజిపైనే వరుడి నిద్ర
స్టేజిపైనే నిద్రపోతున్న వరుడిని చూస్తున్న వధువు

మహాపాత్ర ఇలాంటి వీడియోలు అప్​లోడ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఆయన షేర్​ చేసిన ఇన్​స్టా రీల్స్ అనేకం వైరల్​ అయ్యాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details