కేరళలోని త్రిసూర్‌లో అరుదైన సంఘటన జరిగింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోయే యువకుడిని ఓ యువతి.. నిశ్చితార్థం రోజున లారీ నడుపుకుంటూ చర్చికి తీసుకెళ్లింది. దీంతో ఆమె నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథలందరూ ఆశ్యర్యపోయారు.
గల్ఫ్ 'డ్రైవర్ల' మధ్య లవ్.. లారీ నడుపుతూ యువకుడిని అక్కడికి తీసుకెళ్లిన యువతి! - girl driving lorry
సాధారణంగా నిశ్చితార్థం రోజున.. అందరూ కార్లు, ఆటోలపై ఫంక్షన్ హాల్‌కు వెళ్తుంటారు. కానీ కేరళకు చెందిన ఓ యువతి.. లారీ నడుపుకుంటూ కాబోయే భర్తను చర్చికు తీసుకెళ్లింది. వేడుకకు వచ్చిన అతిథులందరినీ ఆకట్టుకుంది.
జిల్లాలోని మానలూరు చెందిన దలీషాకు చిన్నప్పుడు లారీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. చదువు పూర్తయ్యాక డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. తండ్రి డేవిస్ కూడా లారీ డ్రైవర్ కావడం వల్ల తన ఇష్టాన్ని మరింత పెంచుకుంది. కొన్నిసార్లు తండ్రి లేకుండానే లారీ నడిపి.. కొచ్చి నుంచి పెట్రోల్ తెచ్చి మలప్పురం బంక్‌కు సరఫరా చేసింది. ఆ సమయంలో ఆమె ట్యాంకర్ లారీ నడుపుతున్న వీడియోలు వైరల్ అయ్యయి. దీంతో ఆమెకు గల్ఫ్ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చింది.
గల్ఫ్‌లో ట్యాంకర్ డ్రైవర్‌గా చేరిన సమయంలో.. జిల్లాలోని కంజిరాపల్లికి చెందిన డ్రైవర్ హాన్సన్‌తో అక్కడ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు కుటుంబసభ్యులు ఒప్పుకోవడం వల్ల పెళ్లి కుదిరింది. శనివారం.. సెయింట్ ఆంథోనీ చర్చిలో నిశ్చితార్థానికి పెద్దలు ఏర్పాటు చేశారు. దీంతో కాస్త ప్రత్యేకంగా ఆలోచించిన దలీషా.. హాన్సన్ను కల్యాణమండపానికి లారీలో తీసుకెళ్లింది.