Bomb Threat to Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా పలువురు అకాలీ దళ్ నేతలపై బాంబు దాడికి పాల్పడతామంటూ ఓ లేఖ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. జలంధర్ రైల్వేస్టేషన్, సుల్తాన్‌పుర్ లోధీ రైల్వేస్టేషన్‌తో పాటు మరికొన్ని ప్రధాన ప్రాంతాల్లో కూడా పేలుళ్లకు పాల్పడతామని లేఖలో పేర్కొన్నారు.
సీఎంకు బాంబు బెదిరింపు.. ఆ రైల్వేస్టేషన్లలో కూడా పేలుళ్లు!
Bomb Threat to Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి, అకాలీ దళ్ నేతలు సహా పలు ప్రధాన ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖ సుల్తాన్‌పుర్ లోధీ రైల్వేస్టేషన్ మాస్టర్‌కు అందింది. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.
ఈ లేఖ గురించి సుల్తాన్‌పుర్ లోధీ రైల్వే స్టేషన్ మాస్టర్ రాజ్వీర్ సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. తనకు ఈ లేఖ పోస్ట్ ద్వారా అందిందని.. దీనిని చదివిన తర్వాత వెంటనే అధికారులకు సమాచారం అందించానని పేర్కొన్నారు. ఈ లేఖలో మే 21 గురించి ప్రస్తావన రావడం వల్ల ఆ తేదీకి పేలుళ్లకు సంబంధం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర దర్యాప్తును చేపడుతున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి :ముహుర్తం టైం దాటినా బరాత్‌లో స్టెప్పులు.. వరుడ్ని చితకబాది, పెళ్లి క్యాన్సిల్!