తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో మహమ్మారుల జాబితాలోకి 'బ్లాక్​ ఫంగస్'!​

బ్లాక్ ఫంగస్ ​(మ్యూకోర్​మైకోసిస్)ను మహమ్మారుల జాబితాలో చేర్చింది రాజస్థాన్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 100మంది బ్లాక్ ఫంగస్​ బారిన పడ్డారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Black fungus
బ్లాక్​ ఫంగస్​

By

Published : May 19, 2021, 5:27 PM IST

Updated : May 19, 2021, 7:27 PM IST

రాజస్థాన్​లో మహమ్మారుల జాబితాలో బ్లాక్ ఫంగస్ ​(మ్యూకర్​మైకోసిస్)ను చేరుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్​ అంటువ్యాధుల చట్టం​-​ 2020 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది.

రాష్ట్రంలో 100మంది బ్లాక్ ఫంగస్​ బారిన పడ్డారు. వారిని జైపూర్​లోని సవాయి మన్​సింగ్​ ఆసుపత్రిలో చేర్చారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా నుంచి కోలుకున్న కొందరికి ఈ వ్యాధి సోకుతోందని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా డయాబెటిస్​ వ్యాధితో బాధపడే వారు బ్లాక్​ ఫంగస్​ బారిన పడుతున్నారని తెలిపింది.

ఇదీ చదవండి:అందుబాటులోకి బ్లాక్ ఫంగస్ వ్యతిరేక ఔషధం

Last Updated : May 19, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details