భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధి రాకేశ్ తికాయత్.. పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఘాజిపుర్ సరిహద్దులో విద్యుత్ సరఫరా నిలిపివేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నారు. రైతులందరూ కలిసి స్థానిక పోలీసు స్టేషన్లకు వెళతారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరిగినా.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
మరోవైపు ట్రాక్టర్ ర్యాలీ హింసాకాండపైనా స్పందించారు తికాయత్. రైతు సంఘాల మధ్య చిచ్చు పెట్టి, దేశం నుంచి పంజాబ్‌ను విడదీసేందుకు కొందరు కుట్ర పన్నినట్టు ఆరోపించారు. అందుకే శాంతియుత ర్యాలీలో హింస చెలరేగిందన్నారు.