2008 బాట్లా హౌస్ ఎన్కౌంటర్పై అనుమానాలు లేవలెత్తిన విపక్షాలపై ధ్వజమెత్తారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. పోలీసు, న్యాయ వ్యవస్థలపై అపనమ్మకం ఉంచినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీ పోలీసులను అప్రతిష్ఠ పాలు చేయడానికి ఆయా పార్టీలు చేసిన ప్రచారం వారి మానసిక స్థైర్యంపై ఎంత మేర ప్రభావం చూపిందో అంచనా వేయడానికి ఓ కమిటీ వేయాలన్నారు.
"బాట్లా హౌస్ ఎన్కౌంటర్ ప్రామాణికతపై దిల్లీ పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు తీవ్ర కుట్ర జరుగుతోంది. తద్వారా ఉగ్రవాదులకు మద్దతిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా దేనికోసం? ఇది ముమ్మాటికీ ఓటు బ్యాంకు రాజకీయం."
-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మంత్రి
2008 సెప్టెంబర్ 13న దిల్లీలో ఐదు వరుస బాంబు దాడులు జరిగాయి. ఆ తర్వాత వారానికి జరిగిన ఎన్కౌంటర్లో దిల్లీ ప్రత్యేక పోలీసు అధికారి ఎంసీ శర్మ చనిపోయారు. అయితే ఎన్కౌంటర్లను నిరసిస్తూ నాడు పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.