దేశంలో దశలవారీగా రూ.2000 నోట్లను రద్దు చేయాలని రాజ్యసభ భాజపా ఎంపీ సుశీల్ మోదీ.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న రెండు వేల నోట్లను డిపాజిట్ చేయడానికి రెండేళ్ల సమయం కూడా ఇవ్వాలని అన్నారు. రాజ్యసభలో సమావేశాల్లో భాగంగా సోమవారం క్వశ్చర్ అవర్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.
దేశంలో రూ.2వేల నోట్లను దశల వారీగా రద్దు చేయాల్సిందే!: భాజపా ఎంపీ - కరెన్సీ నోట్ల ముద్రణపై సుశీల్ ప్రసంగం
దేశంలో రూ.2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాజ్యసభ భాజపా ఎంపీ సుశీల్ మోదీ. డ్రగ్స్ వంటి అక్రమ వ్యాపారాల్లో రూ.2000 నోట్లను తరచుగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
దేశంలో చాలా చోట్ల ఏటీఎంలో రూ.2000 నోట్లు రావట్లేదని, అందుకే వాటిని రద్దు చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయని తెలిపారు. ఆ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల క్రితమే రిజర్వ్ బ్యాంక్ నోట్ల ముద్రణ నిలిపివేసిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రూ.2000 నోట్లు లేకపోయినా అభివృద్ధి చెందిన దేశాలను ఆయన ఉదాహరించారు. డ్రగ్స్ వంటి అక్రమ వ్యాపారాల్లో రూ.2000 నోట్లను తరచుగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పెద్దనోట్ల రద్దు.. భారత ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపునకు గురిచేసిన నిర్ణయం. 2016 నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన సంచలన ప్రకటనతో.. అటు సామాన్యులతో పాటు.. ఇటు రాజకీయ నేతలూ ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.