అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. గోవా ముఖ్యమంత్రి (Goa CM change news) ప్రమోద్ సావంత్‌ను భాజపా మార్చనుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా శనివారం.. విలేకరులతో మాట్లాడుతూ సావంత్ ఆధ్వర్యంలో ఎన్నికలకు (Goa Assembly Election 2022) వెళ్తే గెలవడం కష్టమని భావిస్తున్న భాజపా ఆయనను మార్చనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయని వివరించారు. ఎన్నికలకు(Goa Assembly Election 2022) రెండు, మూడు నెలల ముందు ఈ మార్పు చోటు చేసుకుంటుందని చెప్పారు. భాజపా కొత్త ముఖ్యమంత్రిని (Goa CM change news) నియమించినప్పటికీ గోవాలో గెలుపు తమదేనని మనీశ్ అన్నారు.
అదేం లేదు..!
అయితే ఈ ఆరోపణలను భాజపా ఖండించింది. సావంత్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు గోవా భాజపా అధ్యక్షుడు సదానంద్ తనవాడే.