అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణ పేరుతో 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారంటూ భాజపాపై శివసేన సోమవారం పరోక్షంగా ఆరోపణలు చేసింది. పార్టీ అధికారిక పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో శివసేన విమర్శలు చేసింది. రాముడి పేరుతో ఎన్నికల ప్రచారం చేయడం ఆపాలని సూచించింది.
'రాముడి పేరుతో ఎన్నికల ప్రచారమా?'
రామమందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ పేరుతో భాజపా ఎన్నికల ప్రచారం చేస్తోందని శివసేన ఆరోపించింది. పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో విమర్శలు చేసింది. అయితే ఈ ఆరోపణలను భాజపా ఖండించింది.
రాముడి పేరుతో రాజకీయమా!
శివసేన ఆరోపణలను భాజపా ఎమ్మెల్యే అశిష్ షెలర్ ఖండించారు. విరాళాల సేకరణకు ఆటంకం కలిగించేందుకే ఇలా విమర్శలు చేస్తున్నారన్నారు.