తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపు భాజపా జాతీయ కార్యవర్గ భేటీ- అజెండా అదే?

భాజపా జాతీయ కార్యవర్గ భేటీ(Bjp National Executive Meet) ఆదివారం జరగనుంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు.

dBJP national executive meet
జాతీయ కార్యనిర్వాహక భేటీ

By

Published : Nov 6, 2021, 5:49 AM IST

Updated : Nov 6, 2021, 6:31 AM IST

ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో భాజపాకు ఎదురుదెబ్బ తగిలిన తరుణంలో.. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం(Bjp National Executive Meet) ఆదివారం జరగనుంది. బంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ భేటీలో విశ్లేషించనున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించనున్నారు.

అన్ని రకాల ముఖ్యమైన అంశాలను ఈ భేటీలో(Bjp National Executive Meet) చర్చిస్తామని భాజపా నేత ఒకరు తెలిపారు. కొవిడ్ కట్టడిలో కేంద్రం పని తీరును, టీకా పంపిణీ ప్రక్రియను ప్రశంసలు తెలిపే అవకాశం ఉందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల విదేశీ పర్యటనలను విజయవంతగా ముంగించినందుకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినందుకుగాను ఆయనకు అభినందనలు తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.

గత నెల జీఎస్​టీ వసూళ్లలో అనూహ్య వృద్ధి సాధించిన అంశాన్ని కూడా ఈ భేటీలో(Bjp National Executive Meet) చర్చించనున్నారు. అయితే.. ఇటీవల జరిగిన 3 లోక్​ సభ, 29 అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికల ఫలితాలను ప్రధానంగా చర్చించననున్నట్లు తెలుస్తోంది. గతేడాది కరోనా వ్యాప్తి తర్వాత భాజపా కార్యవర్గ భేటీ జరగటం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రధాని ముగింపు ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:వరుణ్​-మేనకా గాంధీకి భాజపా షాక్​- ఎందుకిలా?

Last Updated : Nov 6, 2021, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details