తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నలుగురిని కాదు.. 8 మందిని కాల్చి చంపాల్సింది'

కూచ్​ బిహార్​ కాల్పుల ఘటనపై బంగాల్‌లో భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. "కేంద్ర బలగాలు నలుగురిని కాదు.. ఎనిమిది మందిని కాల్చివేసి ఉండాల్సింది" అంటూ భాజపా నేత రాహుల్ సిన్హా వ్యాఖ్యానించారు. అంతకుముందు మరో నేత ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఎంసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP
భాజపా

By

Published : Apr 13, 2021, 5:08 AM IST

Updated : Apr 13, 2021, 6:44 AM IST

బంగాల్​లో నాలుగోదశ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలు కాల్పులకు దారితీయగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కూచ్‌ బిహార్‌లోని సీతల్‌కుచిలో జరిగిన ఈ ఘటనపై తాజాగా భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేంద్ర బలగాలు నలుగురిని కాదు.. ఎనిమిది మందిని కాల్చివేసి ఉండాల్సిందంటూ తాజాగా భాజపా నేత రాహుల్ సిన్హా వ్యాఖ్యలు చేశారు.

రాహల్‌ సిన్హా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. "నలుగుర్ని కాదు. ఎనిమిది మందిని భద్రతా బలగాలు కాల్చివేసి ఉండాల్సింది. ప్రజలు ఓటు వేయకుండా కుట్ర చేయడంలో మమతకు సాటిలేరు. అందుకే దీదీ టైం ముగిసింది. గూండాలతో ప్రజాస్వామ్య హక్కులను హరించడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి సీతల్‌కుచిలో తగిన సమాధానం లభించింది. ఇలాంటివి పునరావృతం అయితే మళ్లీ అదే సమాధానం వస్తుంది." అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఘోష్​ వార్నింగ్​..!

ఇదివరకే బంగాల్ భాజపా చీఫ్ దిలీప్‌ ఘోష్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. "సీతల్‌కుచిలో నాటీ బాయ్స్‌కు బుల్లెట్లు దిగాయి. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే.. వారికి ఇదే గతి పడుతుంది. బలగాల చేతిలో తుపాకులు కేవలం ప్రదర్శన కోసమేనని భావించిన వారు.. సీతల్‌కుచిలో జరిగింది చూశారు. వారు మరోసారి అలాంటి తప్పులు చేయరు" అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. భాజపా నేతల వ్యాఖ్యలపై తృణమూల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.

ప్రస్తుతం బంగాల్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. కూచ్ బిహార్ జిల్లాలో తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు కాల్పులకు దారితీశాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. అంతకుముందే అదే ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఓ యువకుడు మృతి చెందారు.

ఇదీ చూడండి:కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌చంద్ర నియామకం

Last Updated : Apr 13, 2021, 6:44 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details