తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ నటి బిడ్డకు తండ్రి ఆయనే... - బంగాలీ ఎంపీ నుస్రత్

తల్లయిన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న బంగాలీ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్​ జహాన్​(Nusrat Jahan Husband) బిడ్డకు తండ్రి ఎవరో తెలిసింది. భర్తతో విడిపోయిన తర్వాత.. ప్రముఖ నటుడితో డేటింగ్​లో ఉన్నట్లు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆమె(Nusrat Yash Baby) బిడ్డకు తండ్రెవరనే విషయం హాట్​ టాపిక్​గా మారింది.

Nusrat Jahan
నుస్రత్ జహాన్

By

Published : Sep 17, 2021, 6:20 PM IST

ప్రముఖ బంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్(Nusrat Jahan Husband Name)​ బిడ్డకు తండ్రెవరో బహిర్గతమయింది. కోల్​కతా మున్సిపల్ కార్పొరేషన్​ వెబ్​సైట్​లో నుస్రత్(Nusrat Yash Relationship) బిడ్డ బర్త్​ సర్టిఫికేట్​ వివరాలు పొందుపరిచిన నేపథ్యంలో ఈ విషయం బయటపడింది.

నుస్రత్(Nusrat Jahan Husband Name) ఆగస్టు 26న పండంటి మగబిడ్డకు(Nusrat Yash Baby) జన్మనిచ్చారు. ఆ బిడ్డకు ఈషాన్ అని పేరు పెట్టారు. అయితే.. భర్త నిఖిల్​ జైన్​తో విడిపోయాక నుస్రత్​.. నటుడు, భాజపా నేత యశ్​ దాస్​ గుప్తాతో(Nusrat Yash Dasgupta) డేటింగ్​ చేస్తున్నారనే కథనాలు వెలువడ్డాయి. దీనిపై నుస్రత్​ బహిరంగంగా ఎప్పుడూ స్పందించలేదు. ఇటీవల ఇదే విషయమై మీడియా ప్రశ్నించినా.. స్పష్టమైన జవాబు ఇవ్వలేదు. కానీ, ఆన్​లైన్​లో లభించిన ఈషాన్​ బర్త్ సర్టిఫికేట్​లోని వివరాల ఆధారంగా దేబాషిస్ దాస్​గుప్తా.. నుస్రత్​ బిడ్డకు తండ్రి అని స్పష్టమైంది.

నటి బిడ్డ బర్త్​ సర్టిఫికేట్

యశ్​ దాస్​ గుప్తా అసలు పేరు దేబాషిస్​ దాస్​ గుప్తా(Yash Dasgupta and Nusrat Jahan). ఆయన ఇటీవల జరిగిన బంగాల్​ ఎన్నికల్లో హుగ్లీ జిల్లా నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ప్రముఖ నటి నుస్రత్​ జహాన్​

ఇదీ చదవండి: బిడ్డకు తండ్రెవరని రిపోర్టర్​ ప్రశ్న- దిమ్మతిరిగేలా బదులిచ్చిన నటి

తోడుగానే వెళ్లేవారు..

నుస్రత్​ ఆసుపత్రికి వెళ్లినప్పుడల్లా యశ్​దాస్​ తోడుగా వెళ్లేవారని సమాచారం. 'గతవారం నుస్రత్, యశ్​దాస్​ ఇరువురూ కలిసి కోల్​కతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. తొలుత.. వారు కొవిడ్ టీకా రెండో డోసు తీసుకోవడానికి వచ్చారని అందరూ భావించారు. కానీ, ఈ జంట ఈషాన్​ బర్త్​ సర్టిఫికేట్​ వివరాలు ఇవ్వడానికి వెళ్లారు.' అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

యశ్​దాస్ గుప్తా

నుస్రత్​ పెళ్లి వ్యవహారం.. కొన్నినెలల కిందట ఆమెకు బాగానే చిక్కులు తెచ్చిపెట్టాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇదీ చదవండి:

Nusrat Jahan: తల్లైన ఎంపీ- మాజీ భర్త స్పందన ఇలా...

భర్త సంబంధం లేదన్నాడు కానీ.. నుస్రత్​ ప్రెగ్నెంటే !

ABOUT THE AUTHOR

...view details