భారత సైన్యానికి విశిష్ఠ సేవలు అందించిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ బుధవారం తమిళనాడు కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో ఆయన సతీమణి మధులిక కూడా మృతిచెందారు. భారత సైన్యానికి ఆయన దాదాపు 43 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఎన్నో సంస్కరణలు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. 1978లో సైన్యంలో చేరిన ఆయనకు.. ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో దిట్టగా పేరుంది. రావత్ మృతి నేపథ్యంలో ఆయన ప్రత్యేక చిత్రమాలిక..
బిపిన్ రావత్.. ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో దిట్ట - జనరల్ బిపిన్ రావత్
Bipin Rawat Helicopter: తమిళనాడు కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయారు. 1978లో ఆర్మీలో చేరిన ఆయన చనిపోయే వరకు సైన్యంలోనే ఉన్నారు. దాదాపు 43ఏళ్ల పాటు ఆయన దేశ సేవకే అంకితమయ్యారు.
జనరల్ బిపిన్ రావత్ ప్రస్థానం