Bihar Caste Survey Results : బిహార్ జనాభాలో 63 శాతం కంటే ఎక్కువగా ఓబీసీలు, ఈబీసీలు ఉన్నారని రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే వెల్లడించింది. మొత్తం జనాభా 13.07కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొంది. యాదవ సామాజిక వర్గీయులు.. మొత్తం జనాభాలో 14.27 శాతం ఉన్నట్లు సర్వే తేల్చింది. నీతీశ్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే డేటాను.. పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీ వివేక్ కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు.
Bihar Caste Survey Data : మొత్తం రాష్ట్ర జనాభాలో 36 శాతం అత్యంత వెనుకబడిన, 27 శాతం వెనుకబడిన వర్గీయులు ఉన్నట్లు అధికారుల వెల్లడించారు. హిందువులు 81.9986%, ఇస్లాం 17.7088%, క్రిస్టియన్లు 0.0576% ఉన్నట్లు వివరించారు. 215 కులాల వివరాలను కూడా విడుదల చేశారు.
- యాదవులు- 14.2666%
- కుర్మీ- 2.8785%
- బ్రాహ్మణ- 3.6575%
- బనియా- 2.3155%
- భూమిహార్- 2.8683%
- రాజ్‌పుత్- 3.4505%
- ముసాహర్- 3.0872%
- మల్లాహ్- 2.6086%
'వారందరికీ ప్రత్యేక అభినందనలు'
Caste Survey Bihar : "గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించిన కులగణన వివరాలను విడుదల చేశాం. ఈ కార్యక్రమంలో నిమగ్నమైన వారందరికీ ప్రత్యేక అభినందనలు. శాసనసభలో ఏకగ్రీవంగా కులగణన చేపట్టాలనే ప్రతిపాదన ఆమోదం పొందింది" అని ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ట్వీట్ చేశారు.