వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టించేలా విపక్షాలు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించవని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. నూతనంగా తీసుకువచ్చిన సాగు చట్టాలు రైతుల ఆదాయం పెంచుతాయని పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాజ్‌నాథ్.
ఏ రంగంలో అయినా సంస్కరణలు పూర్తి స్థాయిలో ఫలితాలు చూపించాలంటే కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు కేంద్రమంత్రి. 1991లో మన్మోహన్ సింగ్, ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వడానికి నాలుగైదు ఏళ్లు పట్టినట్లు గుర్తు చేశారు. అదే విధంగా కొత్త వ్యవసాయ చట్టాలు కూడా ఫలితాలు ఇవ్వాలంటే కనీసం రెండేళ్లైనా వేచి చూడాలన్నారు.