తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసక్కలూ.. రక్షణంటే ఇదేనా? - పెట్రోలింగ్​

మహిళల రక్షణ కోసం రాజస్థాన్​ ప్రభుత్వం కొత్తగా మహిళా పోలీసు పెట్రోలింగ్​ బృందాన్ని ఏర్పాటు చేసింది. అధికారం ఉంది కదా అని ఆ మహిళా పోలీసులే ఇద్దరు బాలికలపై అత్యుత్సాహం కనబరిచారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్​గా మారింది. ఈ ఘటన ప్రతాప్​గఢ్​ జిల్లా కేంద్రంలో జరిగింది.

మహిళా పోలీసులు ఇద్దరు బాలికలపై అత్యుత్సాహం కనబరిచారు.

By

Published : Mar 14, 2019, 7:17 PM IST

ఇద్దరు మహిళా పోలీసులు బాలికలపై అత్యుత్సాహం కనబరిచిన దృశ్యాలు వైరల్​గా మారాయి
దేశంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడానికి ఆయా రాష్ట్రాలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాయి. అదే క్రమంలో రాజస్థాన్​ ప్రభుత్వం మహిళల రక్షణకు మహిళా పోలీసు పెట్రోలింగ్​ బృందాన్ని ఏర్పాటు చేసింది.

కొత్తగా అధికారం వచ్చిందన్న ఉత్సాహంలో ఇద్దరు మహిళా పోలీసులు రెచ్చిపోయారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి చేతికి చిక్కిన ఇద్దరు అమాయక బాలికలను తీవ్రంగా హింసించారు. ఇప్పుడా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. మహిళల రక్షణ పేరుతో ఏర్పడిన బృందం సభ్యులే అమ్మాయిలపై దాడి చేయటమేంటని జనం ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటన రాజస్థాన్​ ప్రతాప్​గఢ్​​ జిల్లా కేంద్రలో జరిగింది. పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు బాలికలు ఓ బాలుడితో మాట్లాడుతుండగా మహిళా కానిస్టేబుళ్లు చూశారు. బాలుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతనడు తప్పించుకుని పారిపోయాడు. ఆ కోపాన్ని బాలికలపై చూపించారు పోలీసులు.

ఠాణాకు తీసుకెళ్లే క్రమంలో ఇద్దరు బాలికలపై చేయి చేసుకున్నారు. కాలితో తన్నారు. బాలికలు కొట్టొద్దని ఎంత ఏడుస్తున్నా విడిచిపెట్టలేదు. దూరం నుంచి చూస్తున్న స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలికల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుళ్ల ప్రవర్తనను తప్పుపడుతున్నారు నెటిజన్లు.

ABOUT THE AUTHOR

...view details