ఓ మహిళ తను ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలు చిత్రీకరించి టిక్-టాక్ యాప్‌లో పోస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాలన్న వాదనలు మరింత పెరిగాయి.
భర్త మందలించాడని..

తమిళనాడులో శీరన్తమ్ గ్రామవాసి అనిత. అమెకు ఇద్దరు పిల్లలు. భర్త సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. టిక్ టాక్ యాప్ అనితను విపరీతంగా ప్రభావితం చేసింది. రోజూ ఎన్నో వీడియోలను యాప్‌లో పోస్ట్ చేసేది. పిల్లలకు జ్వరం వచ్చినా పట్టించుకోకుండా యాప్‌లో మునిగిపోయేది అనిత. ఇది గమనించిన భర్త అనితను మందలించాడు.
టిక్ టాక్ వద్దన్నందుకు మనస్తాపానికి గురైన అనిత అత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించింది. చిన్న పిల్లలు తల్లి లేని వారవుతారన్న ఆలోచన కూడా మరిచి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. విషపు మందు తాగుతున్న దృశ్యాలను చిత్రీకరించి యాప్‌లో పోస్ట్ చేసి ప్రాణాలు విడిచింది.
ఇదీ చూడండి:- మోదీ హైతో ముమ్కిన్ హై: పాంపియో