ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన ఓ దళిత యువతి మృతిచెందింది. 19ఏళ్ల ఆమె దిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 3గంటలకు మరణించినట్టు హత్రాస్ ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు.
ఇదీ జరిగింది..
సెప్టెంబర్ 14న యూపీలో దళిత యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని తొలుత యూపీ అలీగఢ్‌లోని జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు కారణమైన నలుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు.