తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అంపన్​ను గుర్తించడంలో భారత్​ కచ్చితత్వం భేష్' - amphan cyclone loses

అంపన్​ తుపాను విషయంలో కచ్చితమైన సమాచారం ఇచ్చిన భారత వాతావరణ విభాగం (ఐఎండీ)పై ప్రశంసలు కురిపించింది ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ). అంపన్ తుపాను తీవ్రత, తీరం దాటే సమయం, ప్రాంతాలను ఐఎండీ కచ్చితంగా అంచనా వేయగలిగిందని చెప్పింది.

amphan
'అంపన్​ను గుర్తించడంలో భారత్​ కచ్చితత్వం భేష్'

By

Published : Jun 8, 2020, 11:16 AM IST

భారత వాతావరణ విభాగం (ఐఎండీ)పై ప్రశంసలు కురిపించింది ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ). అంపన్ తుపానును గుర్తించడంలో భారత వాతావరణ విభాగం కచ్చితమైన అంచనా వేసిందని చెప్పింది. డబ్ల్యూఎంఓ, బంగ్లాదేశ్​కు తుపానుపై కచ్చితమైన సమాచారం ఇచ్చిందని వెల్లడించింది. ఈ మేరకు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్రకు డబ్ల్యూఎంఓ డైరెక్టర్ జనరల్ ఈ మనాఎంకోవా లేఖ రాశారు.

"తుపాను పుట్టుక, తీవ్రత, తీరం దాటే సమయం- ప్రాంతం, వర్షాలు, గాలుల తీవ్రతపై ఐఎండీ, దిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం మూడు రోజులపాటు అందించిన సమాచారం ఎంతో ఉపకరించింది."

-ఈమనాఎంకోవా, డబ్ల్యూఎంఓ డైరెక్టర్ జనరల్

అంపన్ తుపానుపై ఐఎండీ ఇచ్చిన సమాచారం.. ఉష్ణమండల తుపాన్లను అంచనా వేసేందుకు భారత్ పాటిస్తున్న విధానాలు ఉత్తమమైనవని నిరూపించింది.

'అంపన్​పై భారత్​ ఇచ్చిన సమాచారాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శికి ఎప్పటికప్పుడు తెలిపాం. తద్వారా ఈ అంశమై బులిటెన్లు విడుదల చేయగలింగాం. న్యూయార్క్​, సింగపూర్, బహ్రెయిన్​లోని డబ్ల్యూఎంఓ కార్యాలయాలు ఆయా దేశాలను హెచ్చరించేందుకు ఈ సమాచారం ఉపయోగపడింద'ని లేఖలో పేర్కొన్నారు డబ్ల్యూఎంఓ డైరెక్టర్ జనరల్.

ఇదీ చూడండి:ఒడిశా తీరంలో ఓలివ్​ రిడ్లే తాబేళ్ల కనువిందు

ABOUT THE AUTHOR

...view details