పాదచారుల కోసం లక్షలు వెచ్చించి ఈ వంతెన నిర్మించింది ప్రభుత్వం. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటితే ఓ పోలీసు చెక్‌పోస్ట్ ఉంటుంది. హెల్మెట్, వాహనానికి సంబంధించిన దస్త్రాలు లేనివారు అటు వెళ్తే జరిమానా తప్పదు. అందుకే ఈ వంతెనను ఇలా అడ్డదారిగా వినియోగిస్తూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు కొందరు బైకర్లు. పైగా దూరాన్ని తగ్గించేందుకే ఇలా వంతెన పైనుంచి వస్తున్నామని కప్పిపుచ్చుకుంటున్నారు.
ట్రాఫిక్ చలానా భయంతో వీళ్లు ఏం చేస్తున్నారో చూడండి...
మహానగరాల్లో ఉండే ట్రాఫిక్‌లో రోడ్డు దాటాలంటే ఇబ్బందే. అందుకే, పాదచారుల కోసం ప్రత్యేక వంతెనలు నిర్మించింది ప్రభుత్వం. కానీ... ఇప్పుడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను ద్విచక్ర వాహనదారులు వినియోగించుకుని తెగ పొదుపు చేసేసుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పోలీసులకు చిక్కకుండా తెలివిగా తప్పించుకుంటున్నారు.
ట్రాఫిక్ చలానా భయంతో వీళ్లు ఏం చేస్తున్నారో చూడండి...
ఈ వంతెనకు పది అడుగుల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. శ్రుతిమించిన వాడకంతో వంతెన పూర్తిగా దెబ్బతింటోంది. కూలిపోయే స్థితికి చేరుకున్న వంతెనపై పాదచారులు ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్డు దాటుతున్నారు.
Last Updated : Sep 30, 2019, 7:23 AM IST