తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16 కిలోల పసిడితో 'గోల్డెన్​ బాబా' కావడి యాత్ర - బంగారం

ఉత్తరప్రదేశ్​ మేరఠ్​​లో గోల్డెన్​ బాబా కావడి యాత్ర వైభవంగా సాగింది. పటిష్ఠ పోలీసు భద్రత మధ్య ఒంటి మీద 16 కిలోల బంగారంతో బాబా యాత్రలో పాల్గొన్నారు. 85 మంది పురుష భక్తులు ఆయన వెంట వచ్చారు. యాత్ర సాగుతున్నంత సేపు బాబాను చూడటానికి ప్రజలు ఎగబడ్డారు.

16 కిలోల పసిడితో 'గోల్డెన్​ బాబా' కావడి యాత్ర

By

Published : Jul 29, 2019, 6:02 AM IST

16 కిలోల పసిడితో 'గోల్డెన్​ బాబా' కావడి యాత్ర

గోల్డెన్​ బాబా... ప్రతి ఏడాది ఈయన చేసే కావడి యాత్ర చూడటానికి ప్రజలు పోటీపడతారు. ఈ సారి 26వ కావడి యాత్ర ఘనంగా సాగింది. ఒంటి నిండా ధగధగా మెరిసిపోయే బంగారంతో బాబా యాత్రలో పాల్గొన్నారు. శివుడి భక్తుడైన గోల్డెన్​ బాబా ఏటా ఉత్తరాఖండ్​ హరిద్వార్​ నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి దిల్లీ అశోక్​ ప్రాంతంలోని లక్ష్మీ నారాయణ దేవాలయంలో సమర్పిస్తారు. 30 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. దిల్లీకి 29వ రోజు ఈయన యాత్ర చేరుకుంటుంది.

సాధారణంగా 21 కిలోల బంగారంతో యాత్ర చేసే బాబా ఈ సారి 16 కిలోల బంగారాన్నే ధరించారు.

"ఇది నా 26వ కావడి యాత్ర. ఇంతకు ముందు 25 సార్లు యాత్ర చేశాను. గత ఏడాది రజతోత్సవం చేశాం. 25 యాత్రల ద్వారా భోలేనాథుడి సేవలో తరించాను. ప్రస్తుతం ఒంటి మీద 16 కిలోల బంగారం ఉంది. ఈ మధ్య మెడకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యులు ఎక్కువ బరువు మోయకూడదన్నారు."
- గోల్డెన్​ బాబా.

భారీ బందోబస్తు...

ఒంటినిండా బంగారంతో యాత్ర చేసే బాబాకు అడుగడుగునా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనను చూడటానికి, స్వీయచిత్రాలు తీసుకోవడానికి భక్తులు, ప్రజలు పోటీపడ్డారు.

ఎవరీ బాబా..?

గోల్డెన్​ బాబా 2013 వరకు వస్త్ర, స్థిరాస్తి వ్యాపారం చేసేవారు. 2013లో జరిగిన కుంభమేళాకు వెళ్లి.. అప్పటి నుంచి వ్యాపారాలకు స్వస్తి చెప్పి బాబా అవతారమెత్తారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details